- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Collector Rahul Raj : కొనుగోలు చేసిన ధాన్యాన్ని అదే రోజు రవాణా చేయాలి
దిశ, నర్సాపూర్ : కొనుగోలు చేసిన ధాన్యాన్ని అదే రోజు రవాణా చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం నర్సాపూర్ మండల పరిధిలోని ఎర్రగుంట లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు తీరును రిజిస్టర్ ల ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు చేసిన ధాన్యాన్ని అదే రోజు రవాణా చేపట్టి తరలించాలని ధాన్యం కొనుగోలు సిబ్బందికి సూచించారు.
సన్న రకం దొడ్డు రకం విక్రయాలను వేరువేరుగా చేపట్టాలని నిర్వాహకులకు చెప్పారు. సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం రూ. 500 బోనస్ ఇస్తున్నట్లు రైతులకు కలెక్టర్ తెలిపారు. ట్యాబ్ ఎంట్రీని పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని వర్షానికి ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రైతులను కోరారు. కలెక్టరు వెంట నర్సాపూర్ ఆర్డిఓ మహిపాల్, తాసిల్దార్ శ్రీనివాస్, ఆర్ ఐ సిద్ధి రాంరెడ్డి ఆయా ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బంది తదితరులు ఉన్నారు.