- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వంద శాతం పన్ను వసూలు చేయండి: అదనపు కలెక్టర్ వీరారెడ్డి
దిశ, సంగారెడ్డి: అన్ని గ్రామ పంచాయతీలలో ఈ నెల 28వ తేదీలోగా వంద శాతం పన్ను వసూలు చేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఏపీడీ లు, డీఎల్ పీఓ లు, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గం ఎంపీఓలు, ఎంపీడీవోలు, ఏపీవోలు, పంచాయతీ సెక్రెటరీలు, తదితరులతో వివిధ అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై ఆయా అధికారులందరూ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రతి గ్రామపంచాయతీలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఆక్టివ్ లేబర్లలో 50 శాతం లేబర్ ను మొబలైజేషన్ చేయాలని స్పష్టం చేశారు.
తడి, పొడి చెత్త అమ్మకంతో గ్రామపంచాయతీలకు ఆదాయం సమకూరాలని తెలిపారు. ట్యాంకర్ ద్వారా మొక్కలకు వాటరింగ్ చేయడంతో ఉపాధి హామీ పథకంలో ప్రతి గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరేలా ఎంపీడీవోలు, ఎంపీలు, పంచాయతీ కార్యదర్శులు చర్యలు చేపట్టాలన్నారు. వైకుంఠధామాలు, వైకుంఠ రథాలు వినియోగంలోకి తీసుకురావాలన్నారు. వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాల చుట్టూ బయోఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్, డీఆర్ డీఓ శ్రీనివాస రావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, అదనపు పీడీలు, డీఎల్ పీఓ లు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఏపీఎంలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.