- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సొంతడబ్బా కొట్టుకోవడంలో సీఎం కేసీఆర్ దిట్ట: మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి
దిశ, ములుగు: సొంతడబ్బా కొట్టుకోవడంలో సీఎం కేసీఆర్ దిట్ట అని, ఆయన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయం గురించి తనకు నాలుగేళ్లుగా తెలుసని మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి అన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తలపెట్టిన పోరుయాత్రలో భాగంగా గురువారం ఆమె ములుగు మండల పరిధిలోని వంటిమామిడి గ్రామంలోని డబుల్ బెడ్ ఇళ్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ ఇక వీఆర్ఎస్ యేనని ఎద్దేవా చేశారు.సొంతడబ్బా కొట్టుకోవడంలో సీఎం కేసీఆర్ దిట్ట అని ఆమె అన్నారు.
కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితులకు రావాల్సినా ప్యాకేజీలు ఎక్కువగా కావాలని అడిగినందుకు పోలీసుల బలగాలతో ఊరు ఖాళీ చేయించి వారిని ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. బాధితులకు చిన్న రూం, కిచెన్, బాత్రూం ఎటువంటి మెటీరియల్ వాడారో కూడా వారికి తెలియదన్నారు. వర్షాకాలంలో రేకుల షెడ్ లో ఉన్న వారికి దుర్భర పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం తన ఇంటి వాస్తు కోసం ఇంటి ఎదురుగా ప్రాజెక్టు నిర్మించుకున్నాడని ఆరోపించారు. బాధితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ లో రావాల్సిన నిధులు సరిగా కేటాయించలేదన్నారు.
ముంపు గ్రామాల ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించకుండా ఆడవాళ్లపై అసూయ చూపినందుకే సీఎం ఇంటి ఆడవాళ్లకు ఈ పాపం చుట్టుకుందన్నారు. ఈ సందర్భంగా బాధితులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.