ఏడుపాయల జాతరలో అపశృతి..

by Kalyani |
ఏడుపాయల జాతరలో అపశృతి..
X

దిశ, కొల్చారం: ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం ఏడుపాయల జాతరలో చోటుచేసుకుంది. పోలీసులు, భక్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పాపన్నపేట మండల పరిధిలోని శేరిపల్లీ గ్రామానికి చెందిన గురుకాని రవి (30), వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మహా శివరాత్రి జాతరను పురస్కరించుకొని జాతరలో దుకాణ సముదాయం వేసుకొని క్రయ విక్రయాల నిర్వహిస్తున్నాడు. కాగా ఆదివారం స్నాన చేయడానికి తన బావమరిదితో కలిసి చెక్ డ్యాం వద్దకు వెళ్లాడు.

ఈ క్రమంలో రవి నీటిలో మునిగి బయటకు రాలేదు. దీంతో పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో రవిని బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story