చంద్రబాబు ప్రేమ గల్ల మాట చెప్పిండు : Minister Harish Rao

by Shiva |   ( Updated:2023-08-09 09:58:48.0  )
చంద్రబాబు ప్రేమ గల్ల మాట చెప్పిండు : Minister Harish Rao
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై మంత్రి హరీష్ రావు అసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం చంద్రబాబు ఎప్పడూ తెలంగాణ మీద అక్కసును వెళ్లగక్కాడని, ఇటీవలే తెలంగాణ గురించి మంచి మాట చెప్పిండని అన్నారు. ఎన్నడు మన మీద ప్రేమ ఉండకపోవు గని ప్రేమ గల్ల మాట చెప్పిండని అన్నారు. ఇక్కప్పుడు ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో ఐదెకరాలు వచ్చేదని, కానీ, ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 50 నుంచి 100 ఎకరాలు వస్తోందని చెప్పడం సంతోషదాయకమని అన్నారు.

తెలంగాణ పతార ఎంత పెరిగిందో మనం చెప్పడం లేదని, ప్రక్క రాష్ట్ర నాయకుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడే చెబుతున్నాడని అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం తొర్నాలలో రూ.48 కోట్లతో చేపట్టిన తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల మహిళ వ్యవసాయ డిగ్రీ కళాశాల నిర్మాణానికి టీఎస్ ఈ బ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ.. విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా సిద్దిపేటలో పశువుల, పంటల, మనుషుల డాక్టర్ చదువులు చదువుకునే అకాశం ఉందన్నారు.

ఆలయాలకు రిజర్వాయర్లకు ఖిల్లాగా సిద్దిపేట నిలిచిందని, త్వరలో విద్యాలయాలకు నిలయంగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు మహిళ విద్యాకు అలోచించిన దాఖలాలు లేవన్నారు. 2014 కు ముందు రెసిడెన్షియల్ విద్యపై రూ.970 కోట్లు ఖర్చు పెడితే, నేడు రూ.4వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు వెల్లడించారు. సిద్దిపేటలో బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల తీసుకరాబోతున్నట్లు ఆయన తెలిపారు. ఒకప్పుడు జూనియర్ కాలేజీలు తీసుకొస్తే గొప్పగా ఫిలయ్యే వారని, నేడు బిస్కెట్ల లాగా ఇస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పని ఎక్కవ చేసుకుంటూ.. తక్కువ చెప్పకుంటోందని అన్నారు.

సీఎం కేసీఆర్ సారథ్యంలో అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించిందన్నారు. ఒకప్పుడు పంజాబ్ వరి ధాన్యంలో మొదటి స్థానంలో ఉంటే నేడు తెలంగాణ నెంబర్ వన్ గా మారిందన్నారు. ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో దేశంలోనే డాక్లర్ల ఉత్పత్తిలో నెంబర్ వన్ గా మారిందన్నారు. ప్రపంచంలో ఎన్నో దేశాల నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని తెలిపారు. ఇండియాలో ఎక్కువగా ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్స్ హైదరాబాద్ లోను జరగడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రోజాశర్మ, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, తదితురులు పాల్గొన్నారు.

Advertisement

Next Story