చంద్రబాబు నాయుడి వారసుడే రేవంత్ రెడ్డి : Minister Thanneeru. Harish Rao

by Shiva |   ( Updated:2023-07-19 09:14:29.0  )
చంద్రబాబు నాయుడి వారసుడే రేవంత్ రెడ్డి : Minister Thanneeru. Harish Rao
X

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

దిశ, సిద్దిపేట ప్రతినిధి : చంద్రబాబు నాయుడుకు వారసుడు రేవంత్ రెడ్డి అని, గతంలో చంద్రబాబు వ్యవసాయం దండగ అని కరెంట్ చార్జీలు తగ్గించమని పోరాడిన రైతులను కాల్చి చంపాడని గుర్తు చేశారు. నేడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూడు గంటల చాలు కరెంట్ చాలంటూ రైతుల పొట్ట కొట్టేందుకు సిద్ధమవుతున్నాడని ఎద్దేవా చేశారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ పై కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలపై సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ రైతు వేదిక లో నిర్వహించిన రైతు సమావేశానికి మంత్రి హరీష్ రావు హాజరై మాట్లాడారు.

కాంగ్రెస్ నాయకులు సోయి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఓ నాయకుడు ఉచిత కరెంట్ వద్దంటాడు, మరొకడు ఎనమిది గంటలు చాలంటాడు. అలాంటి నాయకులు మనకు అవసరమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్స్, కాలిపోయే మోటార్లు ఉండేవని గుర్తు చేశారు. తెలివి లేని కాంగ్రెస్ నాయకులు వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ సరిపోతుందని మాట్లాడుతున్నాని తెలిపారు. మూడు గంటల కరెంట్ అందించే పార్టీ కావాలా.. మూడు పంటలకు 24 గంటల ఉచిత కరెంట్ అందించే బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలో రైతులు ఆలోచన చేయాలన్నారు.

కాంగ్రెస్ ను పాతాళంలోకి తొక్కి పెట్టాలని పిలుపునిచ్చారు. రైతు బంధు కింద 11 విడతల్లో రూ.72 వేల కోట్లు అందించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కతుందన్నారు. 24 గంటల కరెంట్ కోసం ప్రతి యేటా ప్రభుత్వం రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 1 లక్ష 6 వేల 74 మంది రైతులకు రైతు భీమా అందించినట్లు వెల్లడించారు. ఒకనాడు బతుకుదెరువు కోసం తెలంగాణ ప్రజలు పక్క రాష్ట్రాలకు వలస పోతే..నేడు ఇతర రాష్ట్రాల నుంచి వరినాట్లు వేయడానికి కార్మికులు వలస వచ్చే స్థితికి తెలంగాణ చేరిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో ఎండ కాలంలో పెద్ద చెరువు నిండుకుండలా నిండిందన్నారు.

రాఘవాపూర్ గ్రామంలో 40 మంది రైతులకు రైతు భీమా అందించనున్నట్లు ఆక్ష్న తెలిపారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, ఆత్మ కమిటీ చైర్మన్ లక్కరసు ప్రభాకర్ వర్మ, రూరల్ మండల ఎంపీపీ గన్నమనేని శ్రీదేవి చందర్ రావు, జడ్పీటీసీ శ్రీహరిగౌడ్, సర్పంచ్ ఎర్వ రమేష్, బీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు ఎర్ర యాదయ్య, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed