- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వద్దు..
దిశ, సిద్దిపేట ప్రతినిధి: ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించోద్దని జెడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం, విద్యా-వైద్యం అంశాలపై స్థాయి సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ.. అకాల వర్షాలకు తడిసిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను అదేశించారు. యాసంగి సీజన్ కోసం ఎరువులను అందుబాటులో ఉంచాలన్నారు. హరిత హారంలో నాటిన మొక్కలు సంరక్షించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అయిల్ ఫాం, మల్బరీ సాగు విస్తీర్ణం పెరిగే దిశగా కృషి చేయాలని వ్యవసాయ అధికారికి సూచించారు.
'మన ఊరు-మన బడి' కార్యక్రమంలో చేపట్టిన పనులను త్వరతగతిన పూర్తి చేయాలన్నారు. పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ అసుపత్రులలో పేదలకు మెరుగైన వైద్యం అందించే విధంగా కృషి చేయాలని జిల్లా వైద్యాధికారికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, జెడ్పీటీసీలు లక్ష్మి, కొండల్ రెడ్డి, కోఆప్షన్ మెంబర్ సలీం అధికారులు పాల్గొన్నారు.