- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాలు కీలకం: ఎస్పీ రోహిణి ప్రియదర్శిని.
దిశ, చిన్నశంకరంపేట: నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. చిన్నశంకరం పేట పోలీస్ స్టేషన్ పరిదిలోని దరిపల్లి, అంబాజీపేట, జంగరాయి, గజగట్లపల్లి, గ్రామాల్లో సుమారు 50 సీసీ కెమెరాలు, దాతల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ... మండలంలో అన్ని గ్రామాల, పట్టణ ప్రజలు, ప్రజా ప్రతినిధులు ముందుకొచ్చి తమ గ్రామాల్లో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించే అవకాశం ఏర్పడుతుందని అన్నారు. ఒకవేళ దొంగతనం జరిగినా సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవచ్చని తెలిపారు.
జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అన్ని గ్రామాలు, పట్టణాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసే విధంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని తెలిపారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పట్లూరి మాధవి, సర్పంచ్ లు సిద్ధిరామరెడ్డి, సాన సాయిలు, మీనా రవీందర్, బందెల జ్యోతి ప్రభాకర్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పట్లూరి రాజు తూప్రాన్ డీఎస్పీ శ్రీ.యాదగిరి రెడ్డి, రామాయంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి, చిన్నశంకరంపేట ఎస్సై సుభాష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు