- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఊపందుకున్న క్యాంపు రాజకీయం.. జవహర్ నగర్ టూ బాపట్లకు కార్పొరేటర్లు
దిశ, జవహర్ నగర్: కొన్ని రోజుల్లో జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య భవితవ్యం తేలనుంది. శుక్రవారంతో మూడు ఏండ్లు మేయర్ పదవి పూర్తి చేసుకున్న అనంతరం సుమారు 20మంది కార్పొరేటర్లు మేయర్‌పై అవిశ్వాస తీర్మాన నోటీస్ లో సంతకాల సేకరణ చేపట్టి, సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే మంత్రి నుంచి ఆ పార్టీ కార్పొరేటర్లకు హెచ్చరికలు చేయగా, తాజాగా కార్పొరేటర్లకు విప్ జారీ చేసేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయంపై ఆధారపడింది. ఇదిలా ఉండగా శుక్రవారం నుంచి క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. కార్పొరేటర్లు బాపట్ల కు విహారయాత్రకు వెళ్లినట్టు తెలిసింది. పార్టీ విప్‌ను ఖాతరు చేయకుండా అవిశ్వాస తీర్మాన సమావేశానికి హాజరై మేయర్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని కార్పొరేటర్లు నిర్థారణకు వచ్చినట్టు సమాచారం.
ఒంటరి వ్యూహం ఫలించేనా..
మూడేళ్ల పదవీ కాలంలో కార్పొరేటర్లను కూడగట్టుకోలేకపోయిన మేయర్ ఒంటరి వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. కేవలం బీఆర్ఎస్ అధిష్ఠానం జారీ చేసిన విప్ మీద ఆశలు పెట్టుకున్న మేయర్ వ్యూహం ఎంత వరకు ఫలిస్తుందో వేచిచూడాలి. వాస్తవానికి బీఆర్ఎస్‌కు కట్టుబడిన కార్పొరేటర్లు శిబిరానికి ఎందుకు వెళ్లారు. ఎవరు తరలించారనేది ప్రశ్నార్థకంగా మారింది. అవిశ్వాస తీర్మాన సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తారనే ప్రచారం జరుగుతోంది. మేయర్‌ను పదవి నుంచి దింపడమే లక్ష్యంగా కార్పొరేటర్లు ఎక్కువ మంది మొగ్గు చూపినట్టు కనిపిస్తోంది.
కలవరంలో కావ్య..
జవహార్ నగర్ కార్పొరేషన్ లోని 28 కార్పొరేటర్లలో సుమారు 20 మంది కార్పొరేటర్లు మేయర్ పై అసమ్మతి సెగలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే మేయర్ పదవిపై కారింగిల పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మరో వైపు మేయర్ కుర్చీ కోసం ' కోటీ ' తంటాలు పడుతూ.. కార్పొరేటర్లు క్యాంపు రాజకీయాలకు ఆస్కారం ఇవ్వడంతో ప్రతి ఒక కార్పొరేటర్‌కు ఎంతో కొంత ముట్టజెప్పే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక మేయర్ కావ్య, మంత్రి మల్లారెడ్డి సహకారంతో పురపాలక మంత్రి కేటీఆర్ ఆశీస్సులనే నమ్ముకుని కలవర పడుతున్నట్టు తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే మీరు తప్పించడంమే లక్ష్యంగా చేసుకొని కార్పొరేటర్లు ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఇష్టాన్ని సైతం దిక్కరించే పట్టుదలతో కార్పొరేటర్లు వారికి అనుకూలమైన వారికే మేయర్ పదవి కట్ట పెట్టేందుకు సిద్ధపడుతున్నారు.