మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే: ఎమ్మెల్యే మదన్ రెడ్డి

by Shiva |
మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే: ఎమ్మెల్యే మదన్ రెడ్డి
X

దిశ, నర్సాపూర్: రాష్ట్రంలో మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి అన్నారు. మంగళవారం నర్సాపూర్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించారు. అంతకు ముందు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ జెండాలను గ్రామ కమిటీ అధ్యక్షులు ఎగురవేశారు. నర్సాపూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి బీఆర్ఎస్ జండా ఎగురవేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అభవృద్ధి సంక్షేమ పథకాలతో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాకా అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్తోందని తెలిపారు. విద్యా, వైద్యా రంగాలతో పాటు వ్యవసాయ రంగంలో రాష్ట్రం ఎంతో పురోగతిని సాధించిందని అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో దేశంలో ముందుందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనేని అన్నారు.

దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తూ దేశ ప్రజలు తెలంగాణ వైపు చూసేలా చేసి ఘనత కేసీఅర్ కు దక్కిందన్నారు. ముచ్చటగా మూడోసారి కేసీఅర్ ను ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కేసీఅర్ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. అనంతరం ఏమ్మెల్సీ మల్లేశం మాట్లాడుతూ రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో అనేక మార్పులు వస్తాయన్నారు. మోదీనీ గద్దె దించే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయం, బీసీ సంక్షేమ, మహిళా అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ, ఎస్సీ, ఎస్టీలకు అందుతున్న ఫలాలు వంటి తొమ్మిది తీర్మానాలను ప్రవేశపెట్టి బలపరిచారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఎంపీపీలు మంజుల, హరికృష్ణ, స్వరూప, జడ్పీటీసీలు బాభ్యా నాయక్, ఆంజనేయులు, మేఘమాల, జడ్పీ కోఆప్షన్ మెంబర్ మన్సూర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైడి శ్రీధర్ గుప్తా, లకావత్ రమేష్ నాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భోగచంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story