- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: సంగారెడ్డి జిల్లాలో దారుణం.. కూర బాగోలేదన్నందుకు విద్యార్థిని చితకబాదిన వార్డెన్
దిశ, వెబ్‌డెస్క్: తల్లిదండ్రులను, ఉన్న ఊరిని వదిలి ప్రభుత్వ హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఆపసోపాలు పడుతున్నారు. మంచి చదువు అందుతున్నా.. తినడానికి సరైన తిండి లేక విలవిలలాడిపోతున్నారు. ఒక తమకు వచ్చిన కష్టం గురించి గురించి ప్రశ్నిస్తే.. ఎవరు ఎమంటారోనని భయం వారిలో నిత్యం వెంటాడుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హాస్టల్‌లో వండిన కూర బాగోలేదు అన్నందుకు విద్యార్థిపై వార్డెన్ దాడికి పాల్పడిన ఘటన జిల్లా పరిధిలోని ఎస్టీ హాస్టల్‌లో చోటుచేసుకుంది. సెయింట్ జోసెఫ్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ముకుంద్ పట్టణంలోని ఎస్టీ వసతి గృహంలో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఇవాళ లంచ్‌లో విద్యార్థులకు భోజనం వడ్డించగా.. కూర బాగోలేదని ముకుంద్ వార్డన్‌కు తెలిపాడు. దీంతో కోపోద్రిక్తుడైన అతడు విద్యార్థిని చితకబాదాడు. ఈ క్రమంలోనే విద్యార్థులంతా ఏకమై వార్డెన్‌పై ఫిర్యాదు చేసేందుకు సంగారెడ్డి పోలీస్ స్టేషన్‌కు తరలివెళ్లారు.