Medak District Collector : బోనమెత్తిన మెదక్ జిల్లా కలెక్టర్ దంపతులు

by Sridhar Babu |
Medak District Collector : బోనమెత్తిన  మెదక్ జిల్లా కలెక్టర్ దంపతులు
X

దిశ, మెదక్ ప్రతినిధి : నల్ల పోచమ్మ అమ్మ వారికి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కుటుంబ సమేతంగా బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. మెదక్ జిల్లా కేంద్రంలోని తారక రామ నగర్ నల్ల పోచమ్మ ఆలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అయన సతీమణి శ్రీజ అమ్మ వారికి బోనం తీసుకు వచ్చి మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆషాఢ బోనాల పండగ అంటే గ్రామ దేవత అమ్మవారిని పూజించే పండుగ అని అన్నారు. భోజనం కొత్తకుండలో వండి ప్రదర్శనగా వెళ్లి గ్రామదేవతలకు భక్తి ప్రపత్తులతో సమర్పిస్తారని తెలిపారు.

చిన్నముంతలో పానకం పోస్తారని, దానిపై దివ్వె పెట్టి బోనంపై జ్యోతిని వెలిగించి జాతరను కన్నుల పండుగగా నిర్వహిస్తారని చెప్పారు. తెలంగాణ ప్రజలు గ్రామ దేవతలను భక్తి ప్రపత్తులతో నైవేద్యాన్ని బోనం పేరుతో సమర్పిస్తుంటారని చెప్పారు. బోనాలు పండుగను రాష్ట్ర పండుగగా ఉన్నది కాబట్టి బోనాల పండగ మరింత శోభను సంతరించుకుంది. సాధారణ ప్రజలే కాదు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని తమ భక్తిని చాటుకుంటున్నారని చెప్పారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో పాడి పంటలు, సుఖ సంతోషాలతో ఆనందమయంగా ఉండాలని వర్షాలు సమృద్ధి గా పడి పంటలు బాగా పండాలని మొక్కులు తీర్చుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ క్యాంపు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed