- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ కి బిగ్ షాక్...
దిశ, జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి చింతలగట్టు సుధీర్ సొంత గూటికి తిరిగొచ్చి బీజేపీ కి బిగ్ షాక్ ఇచ్చారు. ఆయన మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. కండువా కప్పి మంత్రి ఆయనను పార్టీలో చేర్చుకున్నారు. ఆయనతోపాటు పార్టీలో చేరిన వారిలో కోహీర్ మాజీ ఎంపీపీ జంపాల అనిత ముదిరాజ్, తెలంగాణ విద్యార్థి పరిషత్ నియోజకవర్గం అధ్యక్షులు సంపత్, నాయకులు కృష్ణారెడ్డి, వార్డు మెంబర్ రవికుమార్, ప్రణయ్, సునీల్, కన్న తదితరులున్నారు. ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ... బీజేపీ దళితుల వ్యతిరేక పార్టీ అని , స్థానికేతరులకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి స్థానిక దళితులను కించపరిచారని, స్థానిక ఎమ్మెల్యే కొనింటీ మాణిక్ రావ్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఎన్నో సేవలను అందిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని చూసి ఎమ్మెల్యే మాణిక్ రావ్ నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన విజయం కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ స్రవంతి అరవింద్ రెడ్డి, కోహీర్ మండల సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, నాయకులు నామ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Read more...
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి పై తన మనసులో మాట చెప్పిన కిషన్ రెడ్డి