ప్రమాదకరంగా భరత్ నగర్ రోడ్డు..

by Sumithra |
ప్రమాదకరంగా భరత్ నగర్ రోడ్డు..
X

దిశ, జహీరాబాద్ : జహీరాబాద్ బైపాస్ నుంచి భరత్ నగర్ వెళ్లే రోడ్డులో ప్రయాణికులకు అనుమతించకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. గత కొంతకాలంగా నిర్మాణంలో ఉన్న కల్వర్టు కారణంగా రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పై నుంచి వరద ఉధృతి పెరగడంతో ఈ సమస్య మరింత తీవ్రంగా మారింది. దీంతో ఈ రోడ్డులో ప్రయాణం ప్రమాదకరంగా పరిణమించింది. దీనిని గమనించిన పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. భారీ వాహనాలు, బీదర్ వెళ్లే ప్రయాణికులు బైపాస్ రోడ్డులో పాత ఆర్టీవో చెక్ పోస్ట్ వద్ద సర్వీస్ రోడ్డు మార్గంలో బీదర్ వెళ్లేలా చర్యలు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed