రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధ శక్తుల పట్ల జాగ్రత్త: Minister Harish Rao

by Satheesh |   ( Updated:2022-11-30 14:39:53.0  )
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధ శక్తుల పట్ల జాగ్రత్త: Minister Harish Rao
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: విద్వేషా పూరిత సిద్దాంతం విభజన రాజకీయాలే ప్రధా‌న భూమికగా ప‌ని చేస్తూ.. అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికి వదిలి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీష్ రావు అన్నారు. దళిత బహుజన ఫ్రంట్ చేపట్టిన రాజ్యాంగ ప్రచార ఉద్యమ కరపత్రాలను సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీష్ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వేచ్చ సమానత్వం సోదరభావం పునాదిగా అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.

డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ.. జనవరి 26 గణతంత్ర దినోత్సవం వరకు రెండు నెలల పాటు రాజ్యాంగంపై ప్రచారం చేపటనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా గొర్రెల పెంపకం దార్ల సహకార యూనియన్ చైర్మన్ పొచబోయిన శ్రీహరి యాదవ్, టీఎస్ ఎంఆర్‌పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్, మాల మహనాడు జాతీయ నాయకుడు కరికె శ్రీనివాస్, డీబీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్ల శంకర్, దళిత బహుజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు దేవి రవీందర్, డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వినయ్, నాయకులు ఎల్లమ్మ, పి.కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

READ MORE

75 సంవత్సరాలుగా బీసీలకు అన్యాయం: MP ఆర్ కృష్ణయ్య

Advertisement

Next Story

Most Viewed