- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి : ఎమ్మెల్యే రఘునందన్ రావు
దిశ, దుబ్బాక : దుబ్బాక వంద పడకల ఆసుపత్రిలో బుధవారం ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలిని ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు వైద్య సిబ్బందికి సూచించారు. బుధవారం వంద పడకల ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో అయన మాట్లాడుతూ.. దుబ్బాక ప్రభుత్వాసుపత్రిలో ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్య సేవలందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
పేద ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలందించాలని ఎమ్మెల్యే తెలిపారు. కనిపించని దేవుడి కన్నా.. కనిపించే దేవుడు వైద్య అధికారులు అని అన్నారు. అనంతరం ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్, తహసీల్దార్ ఎండీ సలీం మియా, మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గన్నే వనిత, ఎంపీపీ కొత్త పుష్పలత, జడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి, వార్డ్ కౌన్సిలర్ దేవుని లలిత, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.