సీజనల్ వ్యాధుల పట్ల అలెర్ట్ గా ఉండాలిః అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

by Nagam Mallesh |
సీజనల్ వ్యాధుల పట్ల అలెర్ట్ గా ఉండాలిః అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
X

దిశ, కౌడిపల్లి: సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మలేరియా చికెన్ గున్యా, డెంగ్యూ వంటి విష జ్వరాలు వ్యాపించకుండా 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం కౌడిపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని రోగుల వద్దకు వెళ్లి వైద్య సేవలు ఎలా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బంది వివరాలను స్థానిక డాక్టర్ ప్రవీణ్ ద్వారా సమాచారం సేకరించారు. మందులు నిల్వ ఉంచే గదిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండలాన్నారు. గ్రామాలలో పర్యటించి ప్రజలకు వ్యాధుల పట్ల, పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. ఆయనతోపాటు స్థానిక వైద్యులు ప్రవీణ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed