బండి సంజయ్‌కు భారీ షాకింగ్ న్యూస్..

by S Gopi |   ( Updated:2023-03-11 13:30:28.0  )
బండి సంజయ్‌కు భారీ షాకింగ్ న్యూస్..
X

దిశ, సంగారెడ్డి: ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. శనివారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆద్వర్యంలో కొత్త బస్టాండు వరకు ర్యాలీ నిర్వహించి బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్భంగా మాజీ సీడీసీ చైర్మన్ విజయేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మీ మాట్లాడుతూ మహిళలను కించపరుస్తూ బండి సంజయ్ మాట్లాడడం తగదన్నారు. ఉన్నతమైన హోదాలో ఉండి ఎమ్మెల్సీ కవితను అవమాన పర్చడం అనుచిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరమన్నారు. రాష్ట్రంలోని మహిళలు బండి సంజయ్ కు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల నర్సింలు, బీఆర్ఎస్ నాయకులు హకీం, మందుల వరలక్ష్మీ, బొంగుల రవి, శ్రీనివాస్ రెడ్డి, డా.శ్రీహరి, అమీరొద్దీన్, శ్రీధర్ రెడ్డి, పరశురాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.



Advertisement

Next Story