- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హరీష్ రావు అహంకర మాటలు మానుకో
దిశ, సిద్దిపేట ప్రతినిధి: దుబ్బాక నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్స్ పై బీజేపీ దుబ్బాక అభ్యర్థి రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. సిద్దిపేట బీజేపీ అభ్యర్థి దూది. శ్రీకాంత్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి రఘునందన్ రావు ముఖ్యఅతిధిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...బీజేపీ నాయకులు ఒకటి రెండు సీట్లు గెలిస్తే ఏం పని చేస్తారని మాట్లాడటం ఆహకార ధోరణికి నిదర్శనం అన్నారు. మంత్రి హరీష్ రావు అహంకర మాటలు మానుకోవాలని హితవు పలికారు. పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఇప్పటి బీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్ కు ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. 2 సీట్లతో మొదలైన బీజేపీ ప్రస్థానంలో 3 వందల పై చిలుకు ఎంపీ సీట్లకు చేరుకుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. సిద్దిపేట జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ రెండు స్థానాలు, బీఆర్ఎస్ 1 స్థానానికి పరిమితమవుతుందని జోష్యం పలికారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేఖంగా పోరాడిన చరిత్ర తెలంగాణ ప్రజలదీ అన్నారు. అహంకార పురిత మాటలను తెలంగాణ సమాజం క్షమించదని, గుణపాఠం తప్పదన్నారు.