- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వార్డుల్లో అభివృద్ధి శూన్యం.. పట్టించుకోని అధికారులు
దిశ సిద్దిపేట: పైన పటారం లోన లొటారం అన్న చందంగా సిద్దిపేట పట్టణం మారిందని, ప్రధాన రహదారులు మినహా వార్డులో అభివృద్ధి జరిగింది శూన్యమని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ ఆరోపించారు. సిద్దిపేట పట్టణంలోని 9వ వార్డు ప్రశాంత్ నగర్లో యూజీడీ నుంచి మురికినీరు పైకి వస్తుండడంతో పాటు మోరీలలో చెత్త చెదారం అలాగే ఉండడంతో ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా అత్తు ఇమామ్ మాట్లాడుతూ.. పట్టణంలోని 9వ వార్డు పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. 9 వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ గెలిచిన నాటినుండి కనీసం వార్డు వైపు చూడటం లేదని వార్డు అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. స్థానిక వార్డు కౌన్సిలర్ పట్టించుకోవడం లేదని మున్సిపల్ అధికారులు, సిబ్బంది కూడా పట్టించుకోవడం మానేశారని ఎద్దేవా చేశారు. వార్డులో పలు యూజీడీ మ్యాన్ హోల్స్ లో నుండి మురికి నీరు పొంగి పైకి వస్తున్న మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదని వాపోయారు. మోరీలలో చెత్తాచెదారం నిండి పోయిందని కొన్ని ఇళ్లకు యూజీడీ కనెక్షన్ ఇవ్వడమే మరిచిపోయారని తెలిపారు. ఈ విషయమై ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రెండు రోజుల్లో ఈ సమస్యలు పరిష్కరించకపోతే ధర్నా రాస్తారోకో చేయడంతో పాటు మున్సిపల్ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ అధికారులు వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పైగా ఏదో అభివృద్ధి చేసినట్టు స్వచ్ఛ సర్వేక్షన్ కోసం పోటీ పడుతుండడం సిగ్గుచేటన్నారు. పట్టణ ప్రజలు తమ వార్డు అభివృద్ధి జరుగుతనే ఫీడ్ బ్యాక్ అందించాలని కోరారు. రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే స్థానిక మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ తమ నిర్లక్ష్యాన్ని విడనాడి పట్టణలోని అన్ని వార్డుల అభివృద్ధి దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. వార్డుల్లో యూజీడీ కోసం రోడ్లు తగిన వాటిని మరమ్మతు చేయకపోవడంతో వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారని, ఆ సమస్యను కూడా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.