బావిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

by Shiva |
బావిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
X

దిశ, చేగుంట: బావిలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన చేగుంట మండల పరిధిలోని వడియారం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సీఎస్ఐ చర్చికి రోడ్డుకు అవతల వైపు భాగంలో ఉన్న బావిలో గుర్తు తెలియని మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు చేగుంట ఎస్సై ప్రకాష్ గౌడ్ బావి వద్దకు వెళ్లి మృతదేహాన్ని గుర్తించారు. శనివారం రాత్రి చీకటి పడటంతో ఆదివారం ఉదయమే బావిలో నుంచి మృతదేహాన్ని తీసేందుక ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు. మృతదేహానికి సంబంధించి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story