గుర్తు తెలియని మృతదేహం లభ్యం

by Shiva |
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన ఘటన సిద్దిపేట త్రీటౌన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. త్రీటౌన్ సీఐ భాను ప్రకాశ్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ పరిధిలోని టీటీసీ బిల్డింగ్ వెనుక గల ఒడిసెల కుంట చెరువులో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారం ఇచ్చారని తెలిపారు. ఘటనా స్థలంలో మృతదేహాన్ని పరిశీలించగా 35 నుంచి 38 ఏళ్ల వయస్సు గల వ్యక్తి గులాబీ రంగు షర్ట్, బ్లాక్ కలర్ ఫాయింట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ భాను ప్రకాష్ తెలిపారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తించినచో 9812667317, 9712582022 ఫోన్ నెంబర్లకు సమాచారం అందించాలని సీఐ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed