- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పది పరీక్షలకు అనుమతించారోచ్..
డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు
ఆనందంలో బాధిత విద్యార్థులు
దిశ, జహీరాబాద్ : పట్టణంలోని ఆక్స్ ఫర్డ్ యాజమాన్యం చేతిలో మోసపోయిన విద్యార్థుల జీవితాలను దృష్టిలో ఉంచుకొని ఎనమిది మంది విద్యార్థులకు పది పరీక్షలు రాసేందుకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనుతించారు. గత మార్చిలో పదో తరగతి పరీక్షలు రాయల్సి ఉండగా యాజమాన్యం చేసిన మోసంతో ఆ పాఠశాలకు చెందిన దత్తగియోని కాలనీ రాహుల్, బసంత్‌పూర్ ధనరాజ్, అహ్మద్ నగర్ సమీర్, పస్తాపూర్ ఇస్మాయిల్, రాంనగర్ అక్బర్, సానియా, మన్నపూర్ దీనా, రామ్‌నగర్ అర్షియా అనే విద్యార్థులకు హాల్ టికెట్లు రాక పరీక్షలు రాయలేకపోయారు.
స్పెషల్ పర్మిషన్ పేరుతో ప్రిన్సిపాల్ మోసాలను గ్రహించి బాధితులు తల్లిదండ్రులతో కలిసి ఆందోళన చేపట్టారు. న్యాయం కోసం జహీరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు. అంతటితో ఆగకుండా విద్యార్థి సంఘాల సహకారంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ దశరథ్ తో పాటు విద్యాధికారి ఇలా అందరికీ తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ తమ పోరాటాన్ని ఉధృతం చేశారు.
ఎట్టకేలకు స్పందించిన అధికార యంత్రం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పదో తరగతి పరీక్షలు రాసేందుకు సప్లమెంటరీలో అనుమతిస్తూ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము పరీక్షలు రాసేందుకు అనుమతించిన ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి, కలెక్టర్, ప్రభుత్వ యంత్రాంగానికి, పోరాటానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.