- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రూ. 5 6.23 లక్షల విలువ ఆల్ఫాజోలం పట్టివేత
దిశ, జహీరాబాద్: ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో అక్రమంగా తరలిస్తున్న 12.980 లీటర్ల గోవా మద్యం,10 బాక్సుల ఆల్ఫ్రాజోలం టాబ్లెట్స్, 150 కండినెట్ సిరప్ బాటళ్ళు పట్టుకున్నారు. వీటిని తరలిస్తున్న కారు , ఇద్దరు నిందితుల అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి..మెదక్ డివిజన్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 65వ జాతీయ రహదారిపై ఉన్న మాడ్గి ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గోవా నుంచి హైదరాబాద్ తరలిస్తున్న ఎన్డీపీ 12.980 లీటర్ల 19 బాటళ్ళను సీజ్ చేశారు. మెదడులో అసాధారణ ప్రభావం చూపే అల్ప్రాజోలం అనే బెంజోడియాజిపైన్స్ అనే మందు కలిగిన 10 బాక్సుల ఆల్ఫ్రాజోలమ్ టాబ్లెట్స్ పట్టుకున్నారు. ఒక్క బాక్స్ లో 10 స్ట్రిప్పులు, ఒక్కో స్ట్రిప్పులో 75 టాబ్లెట్స్ ఉంటాయి. ఈ మొత్తం 7500 టాబ్లెట్స్ సీజ్ చేశారు. అదేవిధంగా 100 ఎమ్ఎల్ గల 150 కండినెట్ సిరప్ బాటళ్ళును కూడా
వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. బైడ్ ఫోర్ వీలర్ కారు , ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో హైదరాబాద్ ఆసిఫ్ నగర్ కు చెందిన ఎండి.అస్లాం , ఎండి.అలీమ్ ఖాన్ లున్నారని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. కర్ణాటక నుంచి ఆల్పోజోలం టాబ్లెట్లను తీసుకొని వచ్చి మసాబ్‌ట్యాంక్ ప్రాంతంలోని అనుమతి లేని షాద్ మెడికల్ షాపులో అమ్మకాలు జరుపుతుంటారు. నిషేది ఆల్పోజోలం టాబ్లెట్లను డ్రగ్ ఇన్‌స్పెక్టర్లతో పరీక్షలు చేయించి వారి నిర్థారణ అనంతరం కేసులు నమోదు చేసినట్లు మెదక్ అసిస్టేంట్ కమిషనర్ జి . శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆల్పోజోలం టాబ్లెట్లను పట్టుకున్న టీమ్‌లో సీఐ సిహెచ్ చంద్రశేఖర్, ఎస్సై బి.యాదయ్య, కానిస్టేబుళ్లు కెఏ సతీష్, జె. రామారావు నాయక్, ప్రహ్లద్‌రెడ్డి, డి. వివేక్, ఖరీప్‌లు ఉన్నారు. ఆల్పోజోలం టాబ్లెట్లను పట్టుకున్న ఎక్సైజ్ అధికారులను, సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి, మెదక్ డిప్యూటి కమిషనర్ హరికిషన్, అసిస్టేంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి అభినందించారు.