Pithampur Agitation : పిథాంపూర్‌ వాసుల ఆందోళనలో ఇద్ధరి ఆత్మాహుతి యత్నం..తీవ్ర ఉద్రిక్తత

by Y. Venkata Narasimha Reddy |
Pithampur Agitation : పిథాంపూర్‌ వాసుల ఆందోళనలో ఇద్ధరి ఆత్మాహుతి యత్నం..తీవ్ర ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్‌ భోపాల్(Madhya Pradesh Bhopal)నుంచి 337 టన్నుల యూనియన్ కార్బైడ్ వ్యర్థాల(Union Carbide Waste)ను పిథాంపూర్(Pithampur) తీసుకరావడా(Taking Away)న్ని నిరసిస్తూ స్థానికులు చేపట్టిన ఆందోళన(Agitation) హింసాత్మకం(Violent)గా మారింది. ఆందోళన కారుల్లో ఇద్ధరు ఆకస్మాత్తుగా పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతి(Two Suicide Attempts)యత్నం చేశారు. వారు మంటలతో పరుగు తీయగా, వారిని అక్కడున్న వారు కాపాడే ప్రయత్నం చేశారు.

యూనియన్ కార్బైడ్ వ్యర్థాల ప్రణాళికకు వ్యతిరేకంగా పిథాంపూర్ లో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. మహారాణా ప్రతాప్ బస్టాండ్ వద్ద నిరంతర ఆందోళన కొనసాగుతోంది. వ్యర్థాల తరలింపును నిరసిస్తూ దాదాపు 1.75 లక్షల జనాభా ఉన్న పిథాంపూర్ నగర బంద్ కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆందోళన కారులు నిప్పంటించుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అల్లర్లు చెలరేగే అవకాశముండటంతో మరిన్ని పోలీసు బలగాలను రంగంలోకి దించారు.

భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన 40 సంవత్సరాల తరువాత, యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుండి 337 టన్నుల విష వ్యర్థాలను 12 సీల్డ్ కంటైనర్ ట్రక్కులలో గ్రీన్ కారిడార్ ద్వారా భోపాల్ కు 250 కి.మీ దూరంలోని పిథాంపూర్ పారిశ్రామిక వ్యర్థాల నిక్షేపణ యూనిట్ కు తరలించారు. ఈ వ్యర్థాలను తొలగించే ఏర్పాట్లను పిథాంపూర్ నుంచి వేరే చోటికి మార్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భోపాల్ యూనియన్ కార్బైడ్ వ్యర్థాలను పిథాంపూర్ లో కాల్చడానికి అనుమతించబోమని వారు ఆందోళనలు చేపట్టారు. తమ ప్రాంతంలో విషపూరిత వ్యర్థాలను నాశనం చేయడం వల్ల మానవ జనాభా, పర్యావరణంపై విష ప్రభావం పడుతుందని వారు భయపడుతూ ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం వారి భయాలను నివృత్తి చేయడంలో విఫలమవ్వడంతో ఆందోళనలు ఉదృతంగా సాగుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed