రసాభాసగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం

by Shiva |
రసాభాసగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం
X

అల్లాదుర్గం మండల బీఆర్ఎస్ లో బయటపడిన పార్టీ విభేదాలు

ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ను నిలదీసిన గ్రామస్థులు

దిశ, అల్లాదుర్గం : మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మండల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రసాభాసగా మారింది. ఆత్మీయ సమ్మేళన సభలో ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతున్న తరుణంలోనే మహిళలు పలు గ్రామస్థులు పలు సమస్యలపై ఎమ్మెల్యేను నిలదీశారు. ఓ మహిళ ఇళ్లు లేక గోస పడుతున్నా.. డబుల్ బెడ్ రూం కోసం అధికారుల చుట్టూ తిరిగిన ఇప్పటి వరకు డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. సమ్మేళనానికి తరలి వచ్చిన వారిలో కొంతమంది తమ సమస్యలను బహిర్గతంగా వ్యక్తం చేస్తున్నప్పటికీ అక్కడున్న కార్యకర్తలు వాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పార్టీ కార్యకర్తలులకు భోజనం కూడా అరకొరగానే పెట్టారని సమాచారం. మండల నాయకులపై కాస్త అసంతృప్తి కార్యకర్తలు ప్రజలు ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story