- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
24 గంటల్లో ధాన్యం లారీలను అన్ లోడ్ చేయాలి.. అదనపు కలెక్టర్ రమేష్
దిశ, మెదక్ ప్రతినిధి : మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని త్వరగా దించుకుంటేనే తిరిగి లోడింగ్ చేయడానికి అవకాశాముంటుందని, కాబట్టి హమాలీలలను అధిక సంఖ్యలో పెట్టుకొని లారీలు వచ్చిన 24 గంటలలోగా ధాన్యం ఆన్ లోడ్ చేయవలసినదిగా అదనపు కలెక్టర్ రమేష్ మిల్లర్లకు సూచించారు. గురువారం తూప్రాన్ పట్టణంలోని నవదుర్గ రైస్ మిల్, సాయినాథ రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసి మిల్లులకు వస్తున్న ధాన్యాన్ని వెంటవెంటనే దించుకోవాలని, తద్వారా కొనుగోలు కేంద్రాల నుండి కూడా ధాన్యాన్ని త్వరత్వరగా లోడింగ్ చేయడానికి అవకాశముంటుందని అన్నారు. ధాన్యంలో కోత పెట్టరాదని, వెంటనే ట్రక్ షీట్ జారీచేయాలని అన్నారు. అదేవిధంగా పెండింగ్ సీఏంఆర్. రైస్ ను రోజు వారి లక్ష్యం మేరకు ఈ నెలాఖరులోగా భారత ఆహార సంస్థకు తరలించాలని సూచించారు.
గన్నిసంచులు, లారీల సమస్య తలెత్తకుండా నిరంతరం మానిటరింగ్ చేస్తున్నామని, ఈ పక్షం రోజులు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరిగేలా జిల్లా అధికారులందరూ అప్రమత్తంగా ఉండి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిరోజు కొనుగోళ్లు ఆగకుండా, రైస్ మిల్లుల వద్ద ధాన్యం దిగుబడి సమస్య రాకుండా నిరంతరం పర్యవేక్షించవలసినదిగా ఆదేశించామన్నారు. ఏమైనా ఇబ్బందులైతే కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కరిస్తున్నామని రమేష్ తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 407 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 33,776 మంది రైతుల నుండి 295 కోట్ల 33 లక్షల విలువ గల 1,43,362 మెట్రిక్ టన్నుల ధాన్యం కోనుగోలు చేసి 10,379 6 మంది రైతుల ఖాతాలో 84 కోట్ల 76 లక్షలు వేశామని, టాబ్ ఎంట్రీ కూడా వేగవంతంగా జరుగుతున్నదని త్వరలో మిగతా రైతులకు ధాన్యం కొనుగోలు డబ్బులు వేస్తామని రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్, తహశీల్ధార్ జ్ఞాన జ్యోతి తదితరులు పాల్గొన్నారు.