- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆర్థిక మద్దతు పథకాల లక్ష్యాలను పూర్తి చేయండి: కలెక్టర్ డాక్టర్ శరత్
దిశ , సంగారెడ్డి: ఈ నెల 28వ తేదీలోగా ఆర్థిక మద్దతు పథకాల లక్ష్యాలను పూర్తిచేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ, బీసీ, సంక్షేమ శాఖల అధికారులతో ఆయా శాఖలలో వివిధ ఆర్థిక మద్దతు పథకాలకు సంబంధించి పురోగతి, పెండింగ్ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థిక మద్దతు పథకాలకు సంబంధించి వంద శాతం లక్ష్యాన్ని సాధించడానికి ఆయా శాఖల అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
దళిత బంధులో ఎవరైనా లబ్ధిదారులకు సంబంధించి పార్షల్ గ్రౌండింగ్ పెండింగ్ ఉన్నట్లయితే, వెంటనే గ్రౌండింగ్ పూర్తి చేయాలని సూచించారు. ఎస్సీ నియోజకవర్గాలైన అందోల్, జహీరాబాద్ లలో మినీ డైరీ లక్ష్యం 920 కాగా ఇప్పటివరకు 409ప్రతిపాదనలు వచ్చాయని, మినీ డైరీ ప్రతిపాదనలను ఎంపీడీఓ ల నుంచి త్వరితగతిన తెప్పించుకోవాలని, స్వయం ఉపాధి పథకాలలో పెండింగ్ ప్రతిపాదనలను మంజూరీ చేయాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారికి సూచించారు. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న వివిధ పథకాలలో సబ్సిడీ రిలీజ్ అయిందని, ఈ నెల 28వ తేదీ లోగా గ్రౌండింగ్ పూర్తి చేయాలని సంబంధిత అధికారికి సూచించారు. స్కాలర్ షిప్స్ కు సంబంధించి బీసీ సంక్షేమ అధికారి జగదీష్ ను ఆరా తీశారు.
వివిధ ఆర్థిక మద్దతు పథకాలకు సంబంధించి కాన్సెంట్ ఇవ్వడంతో పాటు గ్రౌండింగ్ పూర్తిచేసేలా బ్యాంకర్లను ప్రోత్సహించాలని ఎల్డీఎం గోపాల్ రెడ్డిని కోరారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఎల్డీఎం గోపాల్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి జగదీష్, జిల్లా యువజన సంక్షేమ అధికారి రామచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.