- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
పట్టుదలతో 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు
దిశ, కంగ్టి: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని నాగన్ పల్లి గ్రామానికి చెందిన కొండల్ వాడి శ్రీకాంత్, ఒకే సంవత్సరంలో వరుసగా 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి, యువతకు ఒక గొప్ప ఆదర్శంగా నిలిచాడు. అతడి తల్లిదండ్రులు, తుకారం, మహాదేవి. తండ్రి బ్యాంక్ మిత్రంగా పనిచేస్తూ, శ్రీకాంత్‌ను చదివించేందుకు ఎంతో కష్టపడ్డారు. తల్లిదండ్రుల కష్టాన్ని వృథా చేయకుండా, శ్రీకాంత్ పట్టుదలతో చదివి, తన లక్ష్యాలను సాధించాడు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో కొన్నిసార్లు వైఫల్యాలు ఎదురైనప్పటికీ, ఆయన నిరాశ చెందకుండా మరోసారి ప్రయత్నించాడు. ఫలితంగా, 2024లో ఎక్సేంజ్ కానిస్టేబుల్ గా ఎంపికైన శ్రీకాంత్, ప్రస్తుతం న్యాల్కల్ మండలంలోని మూర్తుజ్ పూర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా, టీజీపీఎస్ జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగానికి కూడా ఎంపికైన శ్రీకాంత్, వరుసగా 3 ఉద్యోగాలు సాధించి యువతకు ఒక గొప్ప ప్రేరణ గా నిలిచాడు. వరుసగా మూడు ఉద్యోగులు సాధించిన శ్రీకాంత్ ను గ్రామస్తులు అభినందించారు.