ఏడుపాయలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం...

by Sumithra |
ఏడుపాయలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం...
X

దిశ, కొల్చారం : మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం 12:20 నిమిషాలకు ప్రత్యేక హెలికాప్టర్ లో ఏడుపాయల సమీపంలోని కొల్చారం మండలం పోతంశెట్టి పల్లి శివారులో కురవగడ్డ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక హెలికాప్టర్లో కురవగడ్డ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకున్నారు.

వీరికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, డీసీబీ అధ్యక్షులు చిట్టి దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంజనేయులు గౌడ్, నర్సాపూర్ దుబ్బాక పార్టీ నియోజకవర్గ ఇన్చార్జులు ఆవుల రాజిరెడ్డి, చెరుకు శ్రీనివాస్ రెడ్డి కొల్చారం, పాపన్నపేట మండలాల పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్ ప్రశాంత్ రెడ్డిలు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు దామోదర్, రాజన్న, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ప్రత్యేక వాహనాలలో హెలిపాడ్ నుండి ఏడుపాయల దుర్గాభవాని అమ్మవారి ఆలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం హెలిపాడ్ నుంచి ఆలయం వరకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

భారీ ఎత్తున తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు..

ముఖ్యమంత్రి హోదాలో ఏడుపాయల దుర్గాభవాని దర్శనానికి మొట్టమొదటిసారిగా వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం పలకడానికి మెదక్, నర్సాపూర్ అందోల్, నారాయణఖేడ్, దుబ్బాక తదితర నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఏడుపాయల తరలివచ్చారు. దీంతో మండలంలోని కొత్తపల్లి టీ జంక్షన్ నుండి ఏడుపాయల వరకు జాతర సందడి నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed