ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

by Shiva |
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, చేగుంట: అనారోగ్య, ఆర్థిక సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్య పాల్పడిన ఘటన నార్సింగ్ మండల పరిధిలోని షేర్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై నరసింహులు తెలిపిన వివరాల ప్రకారం శేరిపల్లి గ్రామానికి చెందిన పంబల్ల బాబు (36) అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సర్పంచ్ చేప్యాల మల్లేశం తెలిపారు. మృతుడికి భార్య జోష్ణ, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ఏరియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరసింహులు తెలిపారు.

Advertisement

Next Story