MP Raghunandan Rao : ప్రతి ఇంటి పై జాతీయ జెండాను ఎగుర వేయాలి..

by Sumithra |
MP Raghunandan Rao : ప్రతి ఇంటి పై జాతీయ జెండాను ఎగుర వేయాలి..
X

దిశ, సంగారెడ్డి : ప్రజల్లో జాతీయ భావం పెంపొందించేందుకు ప్రతి ఇంటి పై జాతీయ జెండాను ఎగురవేయాలని మెదక్ ఎంపీ.రఘునందన్ రావు అన్నారు. ఆదివారం బీజేపీ యువమోర్చా రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు సంగారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి అధ్యక్షతన సంగారెడ్డి జిల్లా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో హర్ గర్ తిరంగా యాత్ర కార్యక్రమం నిర్వహించారు. సంగారెడ్డిలో నుంచి ర్యాలీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో ప్రాణత్యాగాలు చేశారని, వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పంద్రాగస్టు సందర్భంగా ప్రతి భారతీయుడికి దేశం పట్ల గౌరవం, అంకిత భావం వివరిస్తూ వారికి వారి ఇండ్లపై జాతీయ జెండాను ఎగురవేసుకునేలా తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రోహిత్ చాహల్ జి, యువ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు సేవెళ్ల మహేందర్, భారతీయ జనతా పార్టీ నాయకులు, యువమోర్చా నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story