- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అక్రమ కట్టడంపై కదిలిన యంత్రాంగం.. దిశ ఎఫెక్ట్

X
దిశ, కంది: ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం పేరిట 14న దిశలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మండల పరిధిలోని బేగంపేట గ్రామంలోని సర్వే నెం.249లో అక్రమంగా నిర్మిస్తున్న ఇంటిని రెవెన్యూ సిబ్బంది పరిశీలించారు. స్థానిక తహసీల్దార్ విజయలక్ష్మి ఆదేశాల మేరకు పూర్తి స్థాయి నివేదికను ఆర్ఐ మల్లికార్జున్ ఆమెకు శనివారం అందజేశారు.
ఇదే విషయమై తాహసీల్దార్ ను దిశ వివరణ కోరగా సర్వేయర్ తో స్థలాన్ని సర్వే చేయించి అక్రమ కట్టడం అయితే తగు చర్యలు తీసుకుంటామని వివరించారు. అలాగే సంగారెడ్డి డీఎల్పీవో సతీష్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక పంచాయతీ కార్యదర్శి శనివారం అక్రమ కట్టడం చేపట్టిన బండారి మల్లేశ్ కు నోటీసులను అందజేశారు. సర్వేపై పూర్తి వివరాలు వచ్చే వరకు ఎలాంటి కట్టడాలు చేయరాదని వారిని అధికారులు హెచ్చరించారు.
Next Story