Ap: తల్లీకూతురు దారుణ హత్య.. కారణం ఇదే..!

by srinivas |   ( Updated:2025-03-23 15:56:15.0  )
Ap: తల్లీకూతురు దారుణ హత్య.. కారణం ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: తల్లీకూతురు(Mother Daughter) దారుణ హత్య(Murder)కు గురైన ఘటన తూర్పుగోదావరి జిల్లా(East Godavari District)లో కలకలం రేపింది. హుకుంపేట వాంబే కాలనీ(Hukumpet Vambe Colony)లో తల్లీకూతురు ఉంటున్నారు. అయితే ఇద్దరు సైతం హత్యకు గురయ్యారు. కత్తితో పొడిచి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. అయితే ఇంటికి వచ్చిన బంధువులు తాళం వేసి ఉండటాన్ని చూసి ఆరా తీశారు. ఎవరూ తమకు తెలియదని చెప్పడంతో ఇంటి కిటికీలోంచి లోపలికి చూశారు.

దీంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు. తల్లీకూతురు రక్తపు మడుగులో పడి ఉన్నారు. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా హత్యకు గురైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఘటనా స్థలాన్ని ఎస్పీ నరసింహా కిశోర్ బృందం పరిశీలించింది. క్లూస్ టీమ్‌తో వేలి ముద్రలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే తల్లీకూతురుని చంపింది శివకుమార్ అనే వ్యక్తిగా గుర్తించారు. తల్లితో ఈవెంట్‌లో పరిచయం అయింది. ఈ పరిచయం స్నేహంగా మారింది. అయితే తల్లి ఇటీవల మరో వ్యక్తితో చాటింగ్ చేస్తుందని శివకుమార్ అనుమానించారు. ఈ విషయంలో గొడవపడి తల్లీకూతురు చంపినట్లు తేలింది. హైదరాబాద్ పారిపోతున్న నిందితుడు శివకుమార్ ను పోలీసులు సాహసం చేసి పట్టుకున్నారు.

Next Story

Most Viewed