AP News:27న రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ విందు.. హాజరు కానున్న సీఎం

by Jakkula Mamatha |
AP News:27న రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ విందు.. హాజరు కానున్న సీఎం
X

దిశ,వెబ్‌డెస్క్: పవిత్ర రంజాన్ మాసాంతం ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు(Iftar dinner) ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక. రంజాన్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల స్థాయిలో ప్రభుత్వం(AP Government) ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఇందుకోసం రూ.1.50 కోట్లను విడుదల చేసింది. రానున్న నాలుగైదు రోజుల్లో కలెక్టర్లు వీలును బట్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ నెల(మార్చి) 27వ తేదీన విజయవాడ(Vijayawada)లోని ఏప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసే రాష్ట్రస్థాయి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే.. సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఈ నెల 27న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. జరుగుతున్న పనులను పరిశీలించిన అనంతరం జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. పనుల పురోగతి, కేంద్రం నుంచి నిధులను రాబట్టడం పై దిశానిర్దేశం చేయనున్నారు.



Next Story

Most Viewed