తప్పులు లేకుండా ఇంటింటి సర్వే నిర్వహించాలి.. కలెక్టర్

by Sumithra |
తప్పులు లేకుండా ఇంటింటి సర్వే నిర్వహించాలి.. కలెక్టర్
X

దిశ, కొండపాక : సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా ఎన్యూమరేటర్లు వివరాలు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ మిక్కిలి మనుచౌదరి అధికారులకు సూచించారు. శనివారం కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో సమగ్ర ఇంటి సర్వేను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా ఇళ్లను సందర్శించి కుటుంబ సర్వే నిర్వహణ కోసం అతికించిన స్టిక్కర్లను చూసి, వాటి పై నమోదు చేసిన ఇంటి నెంబరు, ఎన్యూమరేషన్ బ్లాక్, క్రమ సంఖ్య తదితర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడారు సర్వేలో ఏ ఒక్క కుటుంబాన్ని కూడా విడిచి పెట్టవద్దని, అన్ని కుటుంబాలను సమగ్రంగా వివరాలు సేకరణ చేయాలని కలెక్టర్ ఎన్యూమరేటర్లను ఆదేశించారు. సర్వే నిమిత్తం అధికారులు సందర్శించినప్పుడు తమ పూర్తి సమాచారాన్ని అందించి అధికారులకు సహకరించాలని ప్రజలను కలెక్టర్ కోరారు. ఇంటి యజమాని ఇచ్చిన వివరాలను మాత్రమే ప్రొఫార్మాలో పొందుపరచాలని కలెక్టర్ సూచించారు. ఎలాంటి తప్పులు లేకుండా ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకొని ఇచ్చిన ఫారాల్లో సమాచారాన్ని క్రోడీకరించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ దిలీప్ నాయక్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి చక్రపాణి, ఎన్యూమరేటర్ జ్యోతి ప్రియ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed