అదుపుతప్పిన స్కూల్ బస్సు.. డ్రైవర్ పై కేసు నమోదు

by Shiva |
అదుపుతప్పిన స్కూల్ బస్సు.. డ్రైవర్ పై కేసు నమోదు
X

దిశ, కొహెడ: స్కూల్ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. మండల పరిధిలోని తంగాల్లపల్లి కొహెడ మార్గమధ్యంలో బెజ్జెంకి మండలం రెగులపల్లి గ్రామంలో ఉన్న సెయింట్ విన్సెంట్ పల్లోటి స్కూల్ కు చెందిన బస్సు పిల్లలను తీసుకుని వెళ్తుంది. ఈ క్రమంలో బస్సు పూర్తిగా అదుపు తప్పి రోడ్డు కిందకు వెళ్లి ఓ పెద్ద బావి పక్కనే ఉన్న చెట్టు కొమ్మలకు తట్టి ఆగింది.

హుటాహుటినా అక్కడ ఉన్న తోటి ప్రయాణికులు రెస్క్యూ చేసి పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న మండల విద్యాధికారి పావని మాట్లాడుతూ.. చాలా దిగ్భ్రాంతి కి లోనయ్యానని దేవుడు దయ వల్ల పిల్లలకు ఏమి కాలేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

బస్సును డ్రైవర్ నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా నడపడం వల్లే అదుపు తప్పి వ్యవసాయ పొలాల్లోకి దూసుకెళ్లిందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ మేరకు డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం బస్సు ప్రమాదంలో పిల్లలను సురక్షితంగా కాపాడిన దిశ రిపోర్టర్ కత్తి సతీష్ కుమార్, ఎలక్ట్రికల్ రాజులను ప్రజాప్రతినిధులు, మండల విద్యాధికారి శాలువాతో సత్కరించారు.

Advertisement

Next Story