సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం

by Disha daily Web Desk |
సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం
X

దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లాలో కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రలలో 50 కోవిడ్ కేసులు, ప్రైవేటు ఆసుపత్రులలో 14 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులలో మొత్తం 610 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో జిల్లా ఆసుపత్రి 300 బెడ్లు, జహీరాబాద్ అర్బన్ ఆసుపత్రిలో 70, సదాశివపేట ఆసుపత్రిలో 30, పఠాన్ చెరు ఏరియా ఆసుపత్రిలో 70, నారాయణఖేడ్ 70, జోగిపేట ఆసుపత్రిలో 70 ఉన్నాయి. జిల్లాలో మొత్తం 610 బెడ్లు కోవిడ్ చికిత్స కోసం అందుబాటులో ఉన్నాయి. కాగా సంగారెడ్డి జిల్లాలో మొత్తం 36 ప్రైవేట్, కార్పోరేట్ ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో 1,714 కోవిడ్ బెడ్లు అందుబాటులో ఉండగా ఇందులో 14 బెడ్లలో కోవిడ్ బాధితులు చికిదిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లాలో కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయిత్స పొందుతున్నారు. కాగా 1,700 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. జిల్లా దవాఖానలో రోజు 120 ఆర్టీపీసీఆర్ పరీక్షలు, 150 కి పైగా రాపిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన చాలామంది హోం క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. వాతావరణంలో మార్పులు వస్తున్నందున జలుబు, జ్వరం, దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి భయపడాల్సిన అవసరం లేదు అని, 3 రోజులకంటే ఎక్కువగా ఆ లక్షణాలు కనిపిస్తే డాక్టర్ సలహా మేరకు కోవిడ్ పరీక్షలు చేయించుకొని నిర్ధారణ అయితే సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story