- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖర్గే, డీకే శివకమార్ ఏ మొఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారు..? మేడే రాజీవ్ సాగర్
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ఇచ్చే గ్యారెంటీలను నమ్మితే మోసపోయి గోసపడుతామని, అబద్దపు హామీలతో కర్ణాటక రైతులు హరిగోస పడుతున్నారని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ మండిపడ్డారు. రైతులను నరకయాతన పెడుతున్న కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, డీకే శివకుమార్ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారని విమర్శించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోనేందుకు ముందు కర్ణాటక రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు, కర్ణాటకలో కాంగ్రెస్ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. తెలంగాణలో రైతులకు 24 గంటలు ఉచితంగా కరెంట్ అందజేస్తుంటే.. కర్ణాటకలో మాత్రం కనీసం 3 గంటలు కూడా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను నేరవేర్చని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గ్యారెంటీలు ఇస్తే ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు.