హైడ్రాకు, మూసీకి వ్యతిరేకంగా ఈనెల 25న భారీ ధర్నా : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

by M.Rajitha |   ( Updated:2024-10-18 16:00:51.0  )
హైడ్రాకు, మూసీకి వ్యతిరేకంగా ఈనెల 25న భారీ ధర్నా : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అన్యాయం చేస్తోందని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండి పడ్డారు. శుక్రవారం బీజేపీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. హైడ్రా, మూసీ ప్రక్షాళనలో అన్యాయం పాలైన ప్రజల తరపున ఉద్యమించేందుకు బీజేపీ సమాయత్తం అవుతోంది. ఇందులో భాగంగా ఈనెల 25న హైడ్రా, మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకంగా భారీ ధర్నా చేపపట్టనుందని ఏలేటి ప్రకటించారు. ముందుగా ఈనెల 23, 24 తేదీల్లో మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీజేపీ నేతలంతా పర్యటిస్తారని వెల్లడించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అనుసరించాల్సిన వ్యూహంపై.. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చించినట్టు తెలిపారు. బీజేపీ సభ్యత్వ నమోదును ఉద్ధృతం చేయాలని సునీల్ బన్సల్ సూచించినట్టు పేర్కొన్నారు.

Advertisement

Next Story