- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బయ్యారంలో మళ్లీ నక్సలైట్ల కలకలం.. రిటైర్డ్ ఉద్యోగిని కిడ్నాప్ చేసి రూ.5 లక్షలు డిమాండ్!
దిశ, బయ్యారం: నక్సలైట్ల పేరుతో సింగరేణి రిటైర్మెంట్ ఉద్యోగిని కిడ్నాప్ చేసి.. అటవీ ప్రాంతంలో రెండ్రోజుల పాటు బంధించి అతని నుంచి లక్షలు వసూలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని నామాలపాడుకు చెందిన ఓ సింగరేణి ఉద్యోగి ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ఖాళీగా ఉండలేక.. తన వ్యవసాయ భూమిలో మొక్కజొన్న పంట పొలం వద్దకు వెళ్లారు.
అదే సమయంలో అటుగా వచ్చిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తాము మావోయిస్టులము అని చెప్పి.. కిడ్నాప్ చేశారు. అనంతరం కిడ్నాప్ విషయాన్ని అతని బంధువులకు చెప్పి రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో చేసేదేంలేక కుటుంబ సభ్యులు ఆ డబ్బులను సమకూర్చి వారికి అందించారు. అనంతరం అతన్ని విడుదల చేశారు. దీనిపై సమాచారం అందుకున్న జిల్లా పోలీసు, ఇంటలిజెన్స్ అధికారులు కిడ్నాప్ గురైన బాధితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.