కోతుల దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ

by Aamani |
కోతుల దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ
X

దిశ,కొత్తగూడ : కోతుల దాడిలో మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ వాసులు ద్విచక్ర వాహనంపై మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మీదుగా వరంగల్ వెళుతుండగా కొత్తగూడ మండలం గాదేవాగు దగ్గర కోతులు ఒక్కసారిగా దాడి చేశాయి. ఒక్కసారిగా బైక్ బ్రేక్ వేయడంతో మద్దెల నాగమణి వెనుక వైపు తిరిగి పడటంతో తలకు గాయం అయి తీవ్ర రక్తస్రావం కావడంతో 108 వాహనానికి సమాచారం ఇచ్చి మహిళను అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కొరకు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మండలంలోని కోతుల బెడద రోజు రోజుకి పెరిగిపోతుంది. అడవులను విడిచి గ్రామీణ ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్నాయి. గ్రామాలను కోతుల ఆవాసాలుగా మార్చుకుంటున్నాయి. ఆకలితో అలమటిస్తూ వాహన దారుల పై దాడులు చేసి వారిని తీవ్రంగా గాయపరుస్తున్నాయి. పంట పొలాలకు నాశనం చేసి రైతులకు తీవ్ర నష్టాలను తెచ్చి పెడుతున్నాయి అంటూ మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story