- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Aadi Srinivas: బీఆర్ఎస్ రాష్ట్రంలో అల్లర్లకు ప్లాన్ చేసింది.. విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
by Shiva |

X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీ (BRS Party) రాష్ట్రంలో అల్లర్లకు పక్కా ప్లాన్ చేసిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల (Assembly Sessions) సందర్భంగా లంచ్ బ్రేక్‌లో ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఒకవేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)ను అరెస్ట్ చేస్తే.. ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు కుట్ర చేసిందని కామెంట్ చేశారు. ఇందుకు ప్రతి నియోజకవర్గానికి రూ.కోటి చొప్పున డబ్బు ఇప్పటికే ముట్టజెప్పిందని ఆరోపించారు. అల్లర్లలో భాగంగా ఆర్టీసీ బస్సులు (RTC Buses), ప్రభుత్వ ఆస్తుల (Government Assets)ను తగులబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ (BRS) కుట్రలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని ఆయన పోలీసులకు సూచించారు.
Next Story