ఎన్నికల వేళ మావోయిస్టుల కలకలం. ఏజెన్సీలో సంచలనంగా మారిన కరపత్రాలు

by Javid Pasha |   ( Updated:2023-10-31 04:37:14.0  )
ఎన్నికల వేళ మావోయిస్టుల కలకలం. ఏజెన్సీలో సంచలనంగా మారిన కరపత్రాలు
X

దిశ, గుండాల: 'ఓట్ల కోసం వచ్చే నాయకులను నిలదీయండి సమస్యలు పరిష్కరించబడే వరకు ఎన్నికలు బహిష్కరించండి' అని కోరుతూ మావోయిస్టు పార్టీ ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ పేరుట గుండాల మండలంలోని జామరగూడెం ఆంజనేయుని విగ్రహం వద్ద గల దిమ్మెకు కరపత్రాలు ఏర్పాటు చేశారు. దశాబ్దం తర్వాత మళ్లీ గుండాల మండలంలో మావోయిస్టు కరపత్రాలు వెలుపడటం కలకలం రేపుతోన్నాయి. 'మహిళల్లారా.. ఓట్ల కోసం వస్తున్న రాజకీయ పార్టీలను, నాయకులను నిలదీయండి.. మీ సమస్యలను పరిష్కరించే వరకు ఎన్నికలను బహిష్కరించండి.. మహిలల మనుగడకు అడ్డంకిగా ఉన్న మనువాద పితృస్వామ్య భావజలాన్ని రూపుమాపుతారా? అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలను కల్పించగలరా?' అని కరపత్రాల్లో రాసి ఉంది.

'స్త్రీ-పురుష సమానత్వం కోసం కృషి చేయగలరా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాలయాల్లో నూటికి 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించగలరా? మహిళలపై ఏ విధమైన లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు ఉండవని సమాజంకై హామీని ఇవ్వగలరా? మా బతుకులను ఆగం చేస్తున్న మద్యంపై సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తారా? మహిళల ఎదుగుదలకు ఉచిత విద్యను హామీని ఇవ్వగలరా? వరకట్నాన్ని, వరకట్న వేధింపులను, హత్యలను రూపుమాపగలరా? మహిళా ప్రత్యేక చట్టాలను చిత్తశుద్దితో అమలు చేయగలరా? పరువు హత్యలను ఆపగలరా?' అని మావోయిస్టు పార్టీ ప్రశ్నించింది.




Advertisement

Next Story

Most Viewed