Maoist Dump: మావోయిస్టుల డంప్ కలకలం! భయాందోళనలో ప్రజలు

by Geesa Chandu |   ( Updated:2024-09-21 12:41:36.0  )
Maoist Dump: మావోయిస్టుల డంప్ కలకలం! భయాందోళనలో ప్రజలు
X

దిశ, వెబ్ డెస్క్: ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం ఏజెన్సీ ప్రాంతమైన కాల్వపెల్లి లో మావోయిస్టుల డంప్ కలకలం రేపింది. కాల్వపెల్లి గ్రామ శివారులో ఉన్న పీరయ్య అనే రైతు, తన పోడు భూమిని దున్నుతుండగా ఇనుప డ్రమ్ము బయటపడింది. భూమిలో డ్రమ్మును చూసిన రైతు డంప్ గా భావించి ట్రాక్టర్ డ్రైవర్ తో పాటు అక్కడినుండి వెళ్లిపోయారు. కాల్వపల్లి గ్రామంలోని డ్రమ్ములో సదరు రైతుకు నగదు, ఆయుధాలు లభించాయని స్థానికులు ప్రచారం చేయగా.. చివరికి ఈ విషయం పోలీసులకు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంబంధిత ప్రదేశాన్ని బాంబ్ స్క్వాడ్ తో తనిఖీ చేశారు.

పోలీసులు తనిఖీ చేసిన ఇనుప డ్రమ్ములో ఎలాంటి ఆయుధాలు గానీ, నగదు గానీ లభించలేదు. తర్వాత రైతు పీరయ్య, ట్రాక్టర్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని విచారించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారికి సూచించారు.అలాగే పొలం పనులు చేసేటప్పుడు ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story