- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హోటల్‌లో సీనియర్ల సమావేశం.. రంగంలోకి ఏఐసీసీ
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ నేతలు బిజీ అయ్యారు. రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న నేతలు హోటల్ అశోకా వేదికగా మధ్యాహ్నం భేటీ కానుండగా.. ఈ పరిణామాలను పట్టించుకోనట్టే టీపీసీసీ చీఫ్ మన ఊరు–మన పోరుకు వెళ్తున్నారు. ఇదే సమయంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ సైతం రంగంలోకి దిగారు. వీహెచ్ నిర్వహిస్తున్న సమావేశానికి ఎవరెవరు వెళ్తున్నారనే అంశంపై ఆరా తీశారు. కొంతమంది నేతలకు ఫోన్ చేసి మాట్లాడారు. దీంతో పలువురు నేతలు వీహెచ్ సమావేశానికి వెళ్లేందుకు వెనకాడుతున్నారు. ఫోన్లు స్విచ్ఛాప్ చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు స్థానికంగా ఉండకుండా అటవీ ప్రాంతంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని ముందేసుకున్నారు. ప్రస్తుతం అందుబాటులో లేనంటూ సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది.
సాయంత్రం ఎల్లారెడ్డికి రేవంత్
కాగా, సీనియర్ల విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి కొంత భరోసా ఇచ్చేలా ఏఐసీసీ నుంచి సంకేతాలు వచ్చాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ద్వారా ఏఐసీసీ నేతలు రేవంత్‌కు గో హెడ్ అనే సమాచారమిచ్చినట్లు టాక్. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు వ్యతిరేకించిన మన ఊరు– మన పోరును కంటిన్యూ చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఎల్లారెడ్డిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రేవంత్‌రెడ్డి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
అశోకా హోటల్‌కు వచ్చేదెవరో..
ఇక, హోటల్ అశోకా వేదికగా వీహెచ్ ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశంపై కొంత ఆసక్తి నెలకొంది. కొంతమంది సీనియర్లు దాదాపుగా రామంటూ సమాచారం పంపించారు. శనివారం రాత్రి నుంచి ఠాగూర్ ఫోన్లతో పలువురు వెనకాడుతున్నారు. అయితే, జగ్గారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి మాత్రమే ఈ సమావేశానికి వెళ్తారని సమాచారం. మిగిలిన నేతలు గీతారెడ్డి, శ్రీధర్‌బాబు వంటి వారు దూరంగా ఉండే పరిస్థితి నెలకొంది. ముందుగా మధ్యాహ్నం 12 గంటల వరకు సమావేశం అని సమాచారమిచ్చినా.. మధ్యాహ్నం వరకు నిర్వహించే అవకాశాలున్నాయి.