థాక్రే నయా యాక్షన్ ప్లాన్.. ఇకనైనా T- కాంగ్రెస్ నేతలు ఏకమయ్యేనా..?

by Satheesh |
థాక్రే నయా యాక్షన్ ప్లాన్.. ఇకనైనా T- కాంగ్రెస్ నేతలు ఏకమయ్యేనా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​ గెలుపే లక్ష్యంగా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి థాక్రే యాక్షన్​ ప్లాన్ ​షురూ అయింది. అసంతృప్తి నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి, జగ్గారెడ్డిలతో ప్రత్యేక భేటీ అయ్యారు. పార్టీలో గ్యాప్ ఉండకూడదని, నేతలంతా సహకరించాలని ఆయన వ్యక్తిగతంగా అందరినీ కోరారు. సీనియర్లు, జూనియర్లు అనే భేదాభిప్రాయాలు రావొద్దని నొక్కి చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు పాజిటివ్​వేవ్​ఉన్నదని, నేతలంతా కష్టబడితే 100 సీట్లను గెలిచే ఛాన్స్​ఉన్నదని ఆయన ముఖ్యనేతల ముందు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

పార్టీ గెలిస్తే అందరికీ మంచి రోజులేనని నేతల్లో భరోసా నింపారు. అయితే థాక్రే ముందు అంతా సరేనని సర్దుకున్న లీడర్లు ఇక నుంచి పార్టీ పరువు పోయేలా విమర్శలు చేయకుండా ఉంటారా లేదా అనేది మాత్రం ప్రశ్నార్ధకంగా మారింది. గతంలోనూ ఓ సారి కాంగ్రెస్​పార్టీ నేతలంతా థాక్రేకు హామీ ఇచ్చి.. ఆ తర్వాత మళ్లీ పార్టీ లైన్​తప్పి మాట్లాడటం కాంగ్రెస్‌లో సహజ ప్రక్రియగా మారిపోవడమే దీనికి నిదర్శనం.

ఇన్నాళ్లు అంటిముట్టనట్లు..

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్​బాధ్యతలు చేపట్టిన తర్వాత సీనియర్లంతా ఇన్నాళ్లు పార్టీకి అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు. దీంతో పార్టీలో కేడర్‌లో అసంతృప్తి ఏర్పడటమే కాకుండా అంతర్గత కుమ్ములాటలు ఎక్కువైనాయి. ఇదే విషయాన్ని గతంలో ఇన్‌చార్జిగా ఉన్న మాణిక్కం ఠాకూర్‌కు సీనియర్లు అనేకసార్లు వివరించారు. కానీ ఆయన పెద్దగా స్పందించకపోవడంతో రేవంత్​మద్ధతుదారుడనే ప్రచారం అప్పట్లో జరిగింది. దీంతో జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, మహేశ్వర్​రెడ్డి, దామోదర్​రాజనర్సింహా తదితర సీనియర్లంతా అసంతృప్తిని వ్యక్త పరిచారు.

అయితే కొత్త ఇన్‌చార్జి థాక్రే ఎంట్రీతో కాంగ్రెస్‌లో కాస్త పరిస్థితులు చక్కబడ్డాయని నేతలు చెప్పుకుంటున్నారు. గాంధీభవన్ మెట్లు ఎక్కనని ప్రామిస్​చేసిన కోమటి రెడ్డిని థాక్రే కూల్​చేశారు. ఇక తీవ్రమైన అసంతృప్తితో ఉన్న జగ్గారెడ్డితో ప్రత్యేకంగా కలసి సర్ధి చెప్పారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో లీడర్ల మధ్య గ్యాప్ ఉండకూడదనే థాక్రే సూచించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.

Advertisement

Next Story

Most Viewed