- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాదిగలకు కాంగ్రెస్ పార్టీలో గాడ్ ఫాదర్ లేడు.. మందకృష్ణ మాదిగ ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మాదిగలకు సీట్లు కేటాయించడంలో అన్యాయం చేశాయని ఎమ్మార్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మాదిగల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలలో మాదిగలకు భవిష్యత్తు లేదన్నారు. ఆ పార్టీలో మాదిగలకు ఎంపీ సీట్లు కేటాయించడంలో అన్యాయం చేసిందన్నారు. బీజేపీ పార్టీ మాదిగలకు రెండు సీట్లు కేటయించిందని తెలిపారు. బీజేపీ మాదిగలకు అనుకూలంగా ఉందని, అందుకే బీజేపీకే మా మద్దతు అని స్పష్టం చేశారు. బీజేపీని గెలిపించడానికి సర్వశక్తుల ప్రయత్నిస్తామని చెప్పారు. బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేసి.. ప్రధాని మోడీకి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి అండగా నిలబడతామని తెలిపారు.
సీఎం రేవంత్ మాదిగలకు అన్యాయం చేస్తున్నారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలకు అన్యాయం చేస్తున్నాడని మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. మాదిగల తరపున మాట్లాడితే.. మాలలు తన సీఎం కుర్చీకి ఎసరు పెడ్తారని ఆయనకు భయం పట్టుకుందన్నారు. నాగర్ కర్నూల్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత సంపత్‌కు టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మాల సామాజిక వర్గానికి కాంగ్రెస్‌లో గాడ్ ఫాదర్లు ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత మల్లిఖార్జున ఖర్గే మాల సామాజిక వర్గం, కానీ మాదిగలకు కాంగ్రెస్ పార్టీలో గాడ్ ఫాదర్ లేరని అన్నారు.