MLC కడియం శ్రీహరి ఓ గుంట నక్క: మందకృష్ణ మాదిగ ఫైర్

by Satheesh |   ( Updated:2023-08-29 06:20:25.0  )
MLC కడియం శ్రీహరి ఓ గుంట నక్క: మందకృష్ణ మాదిగ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్‌లో అసమ్మతి రోజు రోజుకు మరింత రాజుకుంటుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు కాకుండా కేసీఆర్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ప్రకటించారు. దీంతో ఘన్‌పూర్ బీఆర్ఎస్‌లో కడియం వర్సెస్ తాటికొండగా రాజకీయం మారిపోయింది. రాజయ్యకు టికెట్ కేటాయించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే కేడర్ కడియం శ్రీహరికి మద్దతు ఇచ్చేది లేదంటుంది. మరోవైపు కడియం అనుచరులు తమ నేతకు టికెట్ కన్ఫార్మ్ కావడంతో నియోజకవర్గంలో స్పీడ్ పెంచారు. ఇలా, కడియం, రాజయ్య ఇద్దరి మధ్య అధిపత్య పోరుతో ఘన్‌పూర్‌ బీఆర్ఎస్‌లో అనిశ్చితి నెలకొంది.

ఇదిలా ఉండగా.. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై ఫైర్ అయ్యారు. కడియం శ్రీహరి ఓ గుంట నక్క అని తీవ్ర విమర్శలు చేశారు. రాజయ్య డిప్యూటీ సీఎం పదవి పోవడానికి కూడా కడియం శ్రీహరినే కారణమని సంచలన ఆరోపణలు చేశారు. ఘన్‌పూర్‌లో మాదిగ సీటు మాదిగకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ బీ ఫామ్ ఎలా వస్తుందో చూస్తామని సవాల్ చేశారు.

Advertisement

Next Story