వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మందకృష్ణ..?

by Sathputhe Rajesh |   ( Updated:2023-12-30 06:36:19.0  )
వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మందకృష్ణ..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని బీజేపీ ప్రకటించిన తర్వాత మందకృష్ణ కాషాయం పార్టీతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు. అయితే వరంగల్ లోక్ సభ స్థానం నుంచి మందకృష్ణ మాదిగను బరిలో దించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలిసింది. మందకృష్ణకు టికెట్ కేటాయిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగల ఓటు బ్యాంకును తమ వైపునకు తిప్పుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇక, వరంగల్ ఎంపీ స్థానాన్న మాజీ ఐపీఎస్ కృష్ణ ప్రసాద్, బీజేపీ సీనియర్ నేత చింతా సాంబమూర్తి ఆశిస్తున్నారు.

Advertisement

Next Story